PoliticsAP News

అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌

అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌

ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశం
అమరావతి: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు.


తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని, కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందన్నారు. మిగిలిన అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలని సీఎం జగన్‌ అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!