AP NewsAP Govt servicesGSWS servicesNationalRevenue servicesVoter ID services

ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం

ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం

  • 18 ఏళ్లు నిండిన వారు అర్హులు షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.
  • జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు.
  • ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్‌ ఇలా.. ఆగస్టు 9 నుంచి అక్టోబర్‌ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన నవంబర్‌1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం.
  • అదే తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
  • ఆ పోలింగ్‌ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in లేదా వోటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల ఓటర్ల జాబితా సిద్ధం చేయండి.
  • ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధంచేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో నగర పంచాయతీల్లో అన్ని వార్డుల్లో.. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధంచేయనున్నారు.

You can also check:- https://hkteluguweblinks.com/nsvp-voter-id-online-services/

https://hkteluguweblinks.com/search-voter-id/

https://hkteluguweblinks.com/download-voter-list/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!