Broadband Connection To AP Software Employees


Table of Contents
Broadband Connection To AP Software Employees – బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభతరం..
కోవిడ్ -19 వైరస్ ని అన్ని విధాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వం… తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ’లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర ఐటి శాఖామంత్రి శ్రీయుతులు మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా మన దేశంలోనే వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చని… ఒకవేళ కరోనా సోకినా కూడా ఏపిలో ఉంటే వైద్య సేవలు ప్రభావవంతంగా అందుతాయన్న ఉద్దేశంతో స్వంత రాష్ట్రానికి వచ్చి వారి వారి ఇంటి నుంచే తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. ఈవిధంగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ హోదాలో పనిచేసే ఉద్యోగులు ఇంటర్నెట్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఉద్యోగులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా వారికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు కావాలనుకునే వారు క్రింద ఉన్న లింక్ ద్వారా సంప్రదించవచ్చు