Civil Supply Proceedings


Table of Contents
Civil Supply Proceedings
Additions and Modifications in Ration Cards procedure – Civil Supply Proceedings


*రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది..*
1.కుటుంబ సభ్యుల్లో కొత్తగా పిల్లల పేర్లను చేర్చడం, వివాహమైన వారికి కొత్తకార్డుల మంజూరు,పేర్ల తొలగింపునకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
2.రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటికే రేషన్‌కార్డు స్థానంలో వార్షిక ఆదాయాన్ని బట్టి బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్, విద్యా దీవెన కార్డులను అందజేస్తోంది.
3.కరోనా నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ పాత రేషన్ కార్డులపైనే బియ్యం అందిస్తోంది. కొందరు అర్హులకు బియ్యం కార్డులు మంజూరుకాలేదు.
4.మరికొన్నిచోట్ల అనర్హులకు దక్కాయి. వీటిని అధికారులు మరోసారి పరిశీలించనున్నారు.
5.అర్హత కలిగిన వారికి బియ్యం కార్డులు జారీ చేసేందుకు చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరైనా కార్డులో లేకపోతే వారి ఆధార్ కార్డును రెవెన్యూ అధికారులకు అందజేయడం ద్వారా రేషన్ కార్డులో చేర్చ వచ్చు. కొత్తగా వివాహమైన జంటలు, వారికి పుట్టిన పిల్ల లతో కార్డు పొందాలంటే ఇంత వరకు తల్లిదండ్రులు ఉన్న రేషన్ కార్డు నుంచి తొలగించాలి.
6.ఇతర ప్రాంతాల్లో వలసవున్న వారు అక్కడే రేషన్‌కార్డు పొందాలనుకుంటే ఇక్కడ కార్డులో పేర్లను తొలగించుకోవాలి.