Ration card servicesAP Govt servicesAP NewsGSWS servicesVolunteer Services

How to do e-KYC for rice cards in AP

How to do e-KYC for rice cards in AP

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన తరువాత రేషన్ కార్డులకి బదులు వాటి స్థానంలో 10 అంకెల రైస్ కార్డులను తీసుకవచ్చారు.

ఈ రైస్ కార్డు పొందిన ప్రతి లబ్ధిదారుడు అందులో ఉన్న ప్రతి సభ్యుడు కూడ ఈ-కెవైసి తప్పనిసరిగా చేయించుకోవాలి అనే నిభంధన కూడ పెట్టారు.

కాని ఇప్పటి వరకు ఈ-కెవైసి చేయించుకోనివారు కూడ చాల మంది ఉన్నారు. అలా ఈ-కెవైసి అవ్వని రైస్ కార్డు లబ్ధిదారులకు VRO నోటిస్ పంపించే అప్షన్ కూడ వెబ్ సైట్ లో ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికే రైస్ కార్డులో ఈ-కెవైసి కాని సభ్యులు ఏవరైన ఉంటే వారు వెంటనే ఈ-కెవైసి చేయించుకోవాలని ఆదేశాలు కుడ జారి చేశారు.

ఆధార్ ఈ-కెవైసి చేయు విధానం:-

  • మీ క్లస్టరు కి నియమింపబడ్డ వాలంటీర్ దగ్గర AePDS యాప్ నందు ఈ నెల 20వ తేదిలోపు ప్రతి ఒక్కరు ఈ-కెవైసి ని పూర్తి చేసుకొవాలి.
  • మీకు దగ్గర్లో ఉన్న ఏ రేషన్ షాప్ డీలర్ వద్ద అయిన వారి e-POS మెషిన్ లో e-KYC అప్షన్ తో కూడ ఈ పక్రియని పూర్తి చేయవచ్చు.
  • రేషన్ షాప్ డీలర్ వద్ద e-KYC చేయు విధానం: Home – Aadhar services – RCeKYC – Enter card number – Select member – Enter the aadhar number then place the finger and confirm the capture.
  • వేలిముద్రలు సరిగ్గా నమోదు అవ్వని వృద్దులు మరియు ఇతరులు ఏవరైన ఉంటే ఇలాంటి వారికి డీలర్ e-POS డివైస్ నందు Fusion ఫింగర్ ఆప్షన్ ని ఉపయోగించాలి.
  • అంటే పైన చెప్పిన విధంగానే అన్ని వేళ్ళు ఒకదాని తరువాత ఒకటి అన్ని స్కాన్ చేస్తూ 10వేళ్ళు పూర్తి అయ్యాక confirm చేయాలి.
  • Fusion ఫింగర్ ఆప్షన్ ద్వార కూడ సరిగా వేళ్ళు నమోదు కాని వారు వెంటనే దగ్గర్లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళి వారి bio metrics ని అప్దేట్ చేసుకోమని చెప్పండి.
  • చిన్న పిల్లలకి ఈ- కెవైసి చేయించేటప్పుడు 811 ఎర్రర్ వచ్చిందంటే వారిని దగ్గర్లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెల్లమని సలహా ఇవ్వండి.చిన్నపిల్లలకు సెప్టంబర్ దాక ఈ-కెవైసి చేసుకోనుటకు సమయం ఇవ్వబడింది.
  • తప్పుగా నమోదు అయిన ఆధార్ కార్డులు ఏవైన ఉంటే వాటిని సరిచేసుకొనే వెసులుబాటు జి.యస్.డబ్ల్యు.యస్ రైస్ కార్డు సర్వీసెస్ నందు ఇవ్వబడింది.
  • గమనిక:- VRO లకు వారి AePDS login లో e- kyc కానీ వారి లిస్ట్ ని download చేసుకొనే ఆప్షన్ నీ ఇచ్చారు. కావున ప్రతి VRO వాలంటీర్లు అందరికీ ఇప్పటివరకు e-KYC కానీ వారి లిస్ట్ ఇవ్వగలరు.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!