NavarathnaluAP Govt servicesAP NewsGSWS servicesVolunteer Services
Jagananna chedodu 2021
Jagananna chedodu 2021 update


Table of Contents
Jagananna chedodu 2021
Updated date: 04/10/2021.
పథకం పేరు: జగనన్న చేదోడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అధికరంలోకి వచ్చాక నవరత్నాలులో భాగంగా జగనన్న చేదోడు అనే పథకం ద్వార నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్స్ కి ప్రతి సంవత్సరం 1000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
అందులో భాగంగానే 2021 ఈ ఆర్థిక సంవత్సరం కూడ ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు.అందుకు సంభందించిన వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.
ధరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన పత్రాలు
- 1. చేదోడు ఆప్లికేషన్ ఫారం.
- 2. ఆధార్ కార్డు జిరాక్స్.
- 3. రైస్ కార్డు జిరాక్స్.
- 4. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్.
- 5. కాస్ట్ సర్టిఫికెట్.
- 6. ఇన్ కం సర్టిఫికెట్.
- 7. షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(మీసేవలో లభించును).
- 8. షాప్ వద్ద యజమాని దిగిన ఫోటో.
గత సంవత్సరం లభ్ధిదారులు ఇవ్వవలసిన డాకుమెంట్స్
గత సంవత్సరం లబ్ధి పొందినవారు ఈ ఆర్థిక సంవత్సరం లబ్ధి పొందుటకు వెరిఫికేషన్ పక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. అందుకుగాను క్రింది వివరాలు మీ వాలంటీర్ కి ఇవ్వవలసి ఉంటుంది.
- 1.ఆధార్ కార్డు జిరాక్స్.
- 2.బ్యాంక్ అకౌంట్ జిరాక్స్.
- 3.రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
- 4.షాప్ ఫోటో.
- 5.ఆధార్ అప్డేట్ హిస్టరీ అడిగే అవకాశం ఉంది.
పథకానికి లబ్ధి పొందుటకు అర్హతలు
- 1. ధరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉండాలి.
- 2. రైస్ కార్డు కలిగి ఉండాలి.
- 3. నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలరింగ్ గా వృత్తి చేస్తూ ఉండాలి.
లబ్ధి ఎంత?
- ప్రతి ఆర్థిక సంవత్సరానికి గాను 10000 వేల రూపాయలు ఇవ్వబడును.
లబ్ధి చేకూరే విధానం
- DBT పద్దతిలో అంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి డబ్బు జమ చేస్తారు.
ముఖ్యమైన తేదిలు
తేది | ఆక్టివిటి |
29/09/2021 | గత సంవత్సర లబ్ధిదారుల వివరాలను బి.సి. కార్పోరేషన్ వారు CEO, APCFSS ద్వార MPDO/MC కి పంపించడం జరుగుతుంది. |
30/09/2021 to 07/10/2021 | ఎంపిడిఒ/ఎంసి వారు తమ మండల లేదా మునిసిపల్ పరిధిలో ఉన్న గ్రామ,వార్డ్ సచివాలయలకు గత సంవత్సర లబ్ధిదారుల వివరాలను రీ-వెరిఫికేషన్ కై పంపిస్తారు. |
08/10/2021 to 11/10/2021 | గత సంవత్సర లబ్ధిదారుల వివరాలు మరియు కొత్తగా అర్హులైన వారి వివరాలు ఎంపిడిఒ/ఎంసి గారు నియమించిన థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్ టీం ద్వార సోషల్ ఆడిట్ పూర్తి చేసి ఎంపిడిఒ/ ఎంసి వారికి పంపించడం జరుగుతుంది. |
12/10/2021 to 14/10/2021 | సోషల్ ఆడిట్ పూర్తి అయిన తరువాత ఎంపిడిఒ/ఎంసి వారు అర్హులను గుర్తించి అనర్హులను తీసివేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ను తయారుచేస్తారు. |
15/10/2021 to 16/10/2021 | సోషల్ ఆడిట్ ద్వార గుర్తించిన అర్హుల జాబితను ఏదైన అభ్యంతరాల ఉంటే స్వీకరించడానికి ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. |
17/10/2021 to 18/10/2021 | అభ్యంతరాలు స్చీకరించిన తరువాత వాటిని తిరిగి ఎంపిడిఒ/ఎంసి కి పంపిస్తారు. వారు ఫైనల్ గా అర్హులను గుర్తించిన తరువాత ఆ లిస్ట్ ను DBCSCS వారికి పంపిస్తారు. |
19/10/2021 to 21/10/2021 | DBCSCS వారు ఫైనల్ గా అర్హుల జాబితను తనిఖీ చేసి అమోదం కోసం జిలా కలెక్టర్ వారికి పంపిస్తారు. |
22/10/2021 to 23/10/2021 | కార్పొరేషన్ వైస్ గా బిల్లులు చేయుటకు EC, DBCSCS వారు CEO, APCFSS వారికి ఫైనల్ జాబితను పంపించడం జరుగుతుంది. |
– | ప్రభుత్వం నిర్ణయించిన తేదిలో లబ్ధిదారులకు వారి అకౌంట్ లో డబ్బు జమ అవుతుంది. |