Jagananna vidya deevena vasathi deevena update 2021


Table of Contents
Jagananna vidya deevena vasathi deevena update 2021
ఫ్రెష్ రిజిస్ట్రేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక లెటర్ అయితే విడుదల చేయడం జరిగింది. అందుకు సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి.
గడువు తేదీ: దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేదీ:20/03/2021. గడువులోగా విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ నందు నమోదు చేయని యెడల ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫీజు చెల్లించబడదు. ఆ సంబంధిత కాలేజీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది.
మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు తమ మేనిఫెస్టో చెప్పిన విధంగా నవరత్నాలు లో భాగంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.
ఉద్దేశ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువుకుంటున్న పేద విద్యార్థుల అందరికి మరింత మెరుగ్గా విద్యా అందివ్వాలి అన్న ఉద్దేశ్యం తో ప్రతిభావంతులైన వారి చదువు కి అయ్యే ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
ప్రయోజనాలు
ఐటిఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, బిటెక్, మరియు పిజి చదువుతున్న విద్యార్థులు అందరికి ఫీజు రీయంబుస్మెంట్ కింద కాలేజీ లో చదువుకి అయ్యే ఖర్చు అంత ప్రభుత్వమే చెల్లిస్తుంది.
అలాగే ఐఐటి చదువుకొనే విద్యార్థులకు 10000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుకునే విద్యార్థుల కి 15000 రూపాయలు మరియు డిగ్రీ, పిజి చదువుకునే విద్యార్థుల కి 20000 రూపాయలు జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందజేస్తుంది.
అర్హతలు
ఎస్సి, ఎస్టీ,బిసి,మైనారిటీ,కాపు,ఈబీసీ మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 2. లక్షల కన్నా తక్కువగా లేదా సమానంగా ఉండాలి.
కుటుంబం యొక్క మొత్తం ఆస్థి వివరాలు 10 ఎకరాలు తరి లేదా 25 ఎకరాలు మెత్త భూమి కంటే తక్కువ ఉండాలి.
అర్బన్ ప్రాంతాలలో, ఇల్లు లేని వారు లేదా 1000 చదరపు అడుగులు కంటే తక్కువ విస్తీర్ణం గల ఇల్లు కలిగివుండాలి.
కుటుంభ సభ్యులలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు మరియు పెన్షన్ వచ్చే వారై ఉండకూడదు, అయితే మునిసిపల్ సానిటరీ కార్మికులందరూ అర్హులే.
కుటుంభ సభ్యులు ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్ మరియు ఆటో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు)
కుటుంభ సభ్యులలో ఎవరు ఆదాయపు పన్ను చెల్లిచేవారు అయి ఉండకూడదు.
విద్యార్థి హాజరు 75% కంటే తక్కువ ఉండరాదు.
కొత్తగా నమోదు మరియు మంజూరు పక్రియ
అర్హత గల ప్రతి విద్యార్థి తమ కాలేజీ నందు జ్ఞానభూమి పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి.
కళాశాల కి సంబందించిన యాజమాన్యం త్వరితిగతిన నమోదు చేయని యెడల విద్యార్థి సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవచ్చు.
నమోదు చేయడానికి కావాల్సిన పత్రాలు
1. 10 వ తరగతి మార్కుల లిస్టు
2. విద్యార్ధి ఆధార్ కార్డు
3. తల్లి ఆధార్ కార్డు
4. కుల ధ్రువీకరణ పత్రము.
5. ఆదాయ ధ్రువీకరణ పత్రము.
6. తల్లి బ్యాంకు ఖాతా నెంబర్.
కళాశాలలో/గ్రామ/ వార్డు సచివాలయంలో నమోదు చేసుకున్న తరువాత వెంటనే విద్యార్థి తన బయో-మెట్రిక్ ను ద్రువీకరించాలి.
దరఖాస్తు చేఉకున్న విద్యార్థులు తమ బయో-మెట్రిక్ వెరిఫికేషన్ ను మీసేవ నందు కానీ లేదా సచివాలయాలు నందు పూర్తి చేయాలి.
బయో-మెట్రిక్ పూర్తి చేసిన విద్యార్థుల యొక్క దరఖాస్తు లను కళాశాల ప్రధానోపాద్యులు వన్ టైం అప్రూవల్ (OTP ) తో నిర్ధారించి జిల్లా సంక్షేమ అధికారికి ఆన్లైన్ లో ఫార్వర్డ్ చేయవలెను.
గడువులోగా నమోదు చేసుకొని విధ్యార్థులు ఈ పథకాన్ని కి అర్హులు కాదు.