Meekosam complaint registration ap
Meekosam complaint registration ap
రాష్ట్ర ప్రజల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, ప్రజా సమస్యలను ఫిర్యాదులు చేయుటకు ప్రభుత్వం ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడానికి ఒక వెబ్ సైట్ రూపొందించింది.
ప్రజా సమస్యల ఫిర్యాదుల రిజిస్ట్రేషన్ మరియు వాటి పరిష్కార వేదిక అయిన స్పందన కార్యక్రమం Spandana Portal పేరుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక / PGRS – Public Grievance Redressal System గా మార్చడం జరిగినది .
ప్రజల సమస్యల దృష్ట్యా ఎలాంటి ఫిర్యాదులను అయిన ఆన్లైన్ లో స్వీకరించి వాటిని సంబంధిత అధికార యంత్రాంగం తో పరిష్కరించుటకు ప్రభుత్వం ఒక కొత్త వెబ్సైటు ను మొదలుపెట్టింది. ప్రతి డిపార్ట్మెంట్లలో ప్రభుత్వం అందించే సేవలు , ప్రభుత్వం ద్వారా అందవలసిన ప్రజా ప్రయోజనాలు, పథకాలు, ఇలా ఇతర అన్ని రకముల ప్రభుత్వ సేవలు, వాటి వల్ల ఎటువంటి సమస్యలు ఉన్న లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న, మీ గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు సమస్యలు ఇతర సమస్యలు ఉన్న ఈ వెబ్సైట్లో మీరు ఫిర్యాదును నమోదు చేస్తే, ఆ శాఖ సంబంధిత అధికారి నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించేలాగా ఈ వెబ్ సైట్ ఏర్పాటు చేయడం జరిగింది.
మీకోసం పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయు విధానం:-
Step 1:- మొదట మీరు కింద కనిపిస్తున్న/ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step2:- పైన ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయగానే మీకు Meekosam హోం పేజి కింద చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది.
Step 3:- Meekosam హోం పేజి ఓపెన్ అయిన తరువాత menu option(అడ్డంగా ఉన్న 3 లైన్స్) మీద నొక్కండి. ఆ తరువాత Login అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
Step 4:- Citizen Login చేసుకోండి . ఆధార నెంబర్ ఎంటర్ చేసి Get eKYC OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. కింది విధంగా మీకు ఒక పేజి ఓపెన్ అవుతుంది.
Step 5:- పైన కనిపించిన విధంగా అక్కడ మీరు Citizen login ని select చేసి మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి Get ekyc OTP పై క్లిక్ చేయండి.
Step 6:- మీరు అలా Get ekyc OTP మీద క్లిక్ చేయగానే, మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు మేసేజ్ వస్తుంది. ఆ OTP నీ అక్కడ ఎంటర్ చేసి Verify ekyc OTP పై click చేయండి. కింది విధంగా మీకు ఒక పేజి ఓపెన్ అవుతుంది.
Step 7:- పైన కనిపించిన పేజిలో Grievance Registration అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. తరువాత ఓపెన్ అయ్యే పేజిలో వివరాలు అంటే కింది విధంగా అన్ని నమోదు చేయాలి.
Do You Want to Change Mobile No? – Yes / No
Type Of Grievance Individual/ Community
Step 8:- అన్ని వివరాలు ఎంటర్ చేశాక Submit Grievance పై క్లిక్ చెయ్యాలి . అర్జీ నెంబర్ Messege మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వస్తుంది.
గమనిక:- Meekosam పోర్టల్ లో మీరు నమోదు చేసిన ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి కింద లింక్ నీ క్లిక్ చేయండి.
Grievance No అనే చోట మీకు మేసేజ్ వచ్చిన అర్జీ నెంబర్ నమోదు చేసి, పక్కనే ఉన్న CAPTHA ను ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేస్తే, మీ అర్జీ స్టేటస్ ఏ స్థితిలో ఉంది అనేది తెలుస్తుంది.