rice distribution in ap


Table of Contents
AP Sarkar Rice Distribution To Citizens Home Delivery
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే ఏన్నో సంక్షేమ కార్యకరమాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేశారు. అదే తరహాలో ప్రజలకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ బియ్యం అందించాలి అన్న మంచి సంకల్పం తో “ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ” తో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
త్వరలో చేపట్టనున్న “ఇంటింటా నాణ్యమైన బియ్యం” పంపిణీ కి రేషన్ షాపు ల వారీగా రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు. అవసరం అయిన మేరకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించాలని కోరారు. పంపిణీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోవడం తి పట్టణ ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి సారించారు. ఒకేసారి అధిక మొత్తంలో బియ్యం రవాణా చేయుటకు నాలుగు చక్రాల వాహనంలు వినియోగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 29784 రేషన్ షాప్ లు ఉన్నాయి వీటిలో పరిధిలో మొత్తం 1,50,15,765 కార్డులు ఉన్నట్లు గా గుర్తించారు. ఒక రేషన్ షాప్ లో ఏన్ని కార్డులు ఉన్నాయి వాటి ఆధారంగా రూట్ మావు అన్నది సిద్దం చేశారు. వివరాలను గ్రామీణ, పట్టణాల వారీగా విడివిడిగా తయారు చేశారు. ప్రతి రెండువేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటుచేసి ఇంటి వద్దకే వెళ్ళి తూకం వేసి బియ్యం పంపిణీ చేస్తారు. నాణ్యమైన బియ్యం పంపిణీ లో బాగంగా ఇప్పటికే పైలట్ జిల్లా కింద శ్రీకాకుళం లో ఇప్పటికే అమలు అవుతున్నది. లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు వీలుగా బియ్యం బ్యాగుల కూడా ఉచితంగా అందించనున్నారు. మార్గ మధ్యంలో ఎలాంటి కల్తీకి అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బాగ్ పై స్ట్రిప్ seal కూడా వేయనున్నారు. ప్రతి బ్యాగు కు బార్ కోడ్ కూడా ఉంటుంది. వాహనంలో నే వెయింగ్ మెషిన్ ఉండటం వల్ల అక్కడే తూకం వేసి ఇస్తారు. రాష్ట్రం లో మొత్తం 13 వేలకు పైగా వాహనాలు అవసరం అవుతాయి అని అధికారులు అంచనా వేశారు.