YSR CHEYUTHA SCHEDULE IMPLEMENTATION


Table of Contents
YSR CHEYUTHA SCHEDULE IMPLEMENTATION – వైస్సార్ చేయూత లబ్ధిదారుల ఎంపిక కి సర్వే
శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన మంత్రి కాబినెట్ సమావేశం లో 45 సం.లు నిండి 60సం.లు వయస్సు లోపు ఉన్న మహిళలకు 75000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసే వైస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు, ఇది అందరికీ తెలిసిన విషయమే,
వైయస్సార్ చేయూత పథకానికి లబ్ధిదారుల ఎంపిక కు వాలంటీర్లు ద్వారా ఇంటింటా సర్వే చేయించాలని పంచాయతీ రాజ్ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే తాజా ఉత్తర్వుల మేరకు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న మహిళలు ను అనర్హులుగా పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో 10 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయలు లోపు ఆదాయం ఉన్న కుటుంబాలే ఇందులో అర్హులు.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. . లబ్ధిదారుల ఎంపిక పక్రియను వాలంటీర్లు ఇంటింటా సర్వే లో 15 అంశాల మీద mobile app ద్వారా వివరాలు సేకరిస్తారు.
. అర్హుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయం లో ఉంచి, గ్రామ సభలు నిర్వహించి వాటిపై సోషల్ సర్వే చేస్తారు.
. అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి తదనుగుణంగా తుది అర్హులను ప్రకటిస్తారు.
వైయస్సార్ చేయూత పథకానికి చెందిన SCHEDULE IMPLEMEMTATION కింది ఇమేజ్ లో ఇవ్వడం జరిగింది.