how to apply graduate mlc voter online
how to apply graduate mlc voter online
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏం.ఎల్.సి. ఎన్నికల కోసం పట్టభద్రుల మరియు టీచర్ల కు ఓటు హక్కు కల్పించేలా మాన్యువల్‌గా కాకుండా ఆన్ లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు AP ఎన్నికల అధికారులు.
గ్రాడ్యుయేట్లు డిగ్రీ మార్కుల జాబితానీ, ఉపాధ్యాయులైతే ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే సర్టిఫికెట్‌ను ఓటరు నమోదు దరఖాస్తుకు జత చేయాలి.
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఫారం-18 ని నింపాలి.
ఉపాధ్యాయులు ఫారం-19 అందజేయాలి.
ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాల్లో, ఆన్‌లైన్‌లో లేదా బీఎల్వోల వద్ద నమోదు చేసుకోవచ్చు.
వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుంది. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు ఉంటే చూస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
How to apply for Graduate/Teachers MLC voter ID
1st step:- MLC పట్టభద్రుల లేదా ఉపాధ్యాయుల ఓటరు నమోదుకై ముందుగా మీరు AP CEO portal నీ ఓపెన్ చేయాలి. అందుకుగాను ఇక్కడ క్లిక్ చేయండి.
2nd step:- మీరు పై లింక్ పైన click చేయగానే AP ఎన్నికల కమిషన్ హోంపేజి అవుతుంది. తరువాత right side కనిపించే menu bar పైన క్లిక్ చేయండి.
3rd step:- మీరు menu bar పైన క్లిక్ చేశాక E-Registration పై క్లిక్ చేయండి. అక్కడ మీకు Aasembly constituency మరియు Council constituency అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు Council constituency ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు Graduate (form-18) మరియు Teachers (form-19) అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
4th step:- మీరు పట్టభద్రులు అయితే Graduate (form-18) option ని ఉపాధ్యాయులు అయితే Teachers(form-19) option ని ఎంచుకోండి.
5th step:- మీరు కావాల్సిన ఆప్షన్ ని ఎంచుకున్న తరువాత form -18 కానీ లేదా form -19 application పేజీ ఓపెన్ అవుతుంది. తరువాత మీరు అక్కడ కనిపించే అన్నీ కాలమ్స్ నీ fill up చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ని upload చేసి submit చేయండి.