How to check dotted lands in AP
AP prohibited lands for registration
How to check dotted lands in AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ROR అనేది రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డుల రిజిస్టర్‌ల నుండి సేకరించబడినది. ROR 1B భూమి ఆస్తి మరియు భూమిపై హక్కు ఉన్నవారి చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తుంది.
ఈ ROR ఆస్తి యొక్క చట్టపరమైన స్థితికి కీలకమైన సూచిక. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR-1B) రిజిస్టర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విడివిడిగా ప్రతి గ్రామానికి తయారు చేసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కుల రికార్డులో ప్రభుత్వం ఎంట్రీల సర్టిఫైడ్ కాపీలను జారీ చేస్తుంది.
ఏ వ్యక్తి అయినా ఒక వ్యవసాయ భూమిని గానీ, ఇళ్ళ స్థలం గానీ, ఇంకా ఇతర ఆస్థినీ అమ్మదలుచుకున్నప్పుడు ఆ అమ్మే వ్యక్తి పేరిట భూమి హక్కు ఉన్నట్టు మండల రెవెన్యూ అధికారి చేత ఆమోదించిన ROR-IB నీ కలిగి ఉండాలి.
అయితే కొన్ని సందర్భాలలో ROR-IB ఉన్న కొన్ని సర్వే నంబర్స్ నీ రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించరు. ఆ విధంగా అనుమతించని భూముల యొక్క వివరాలు మరియు ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్ లను రిజిస్ట్రేషన్ కి అనుమతించరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
RSR లేదా Diglot అంటే ఏమిటి?
బ్రిటిష్ వారు 1971 వ సంవత్సరంలో భూములు అన్నిటినీ సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ఆ భూమి పట్టాదరునికి ఏ విధంగా వచ్చింది అనేది ఒక రికార్డ్ నీ తయారుచేసి పెట్టారు. దానినే మనం RSR (Resettlement register) అని పిలుస్తున్నాం. దీనిని మనం Diglot (డైగ్లాట్) అని కూడా పిలుస్తంటారు.
అయితే ఒక వ్యక్తికి భూమి అనేది అనువంశికo ద్వారా, పట్టా ద్వారా, పిత్రార్జితం ద్వారా, డి- పట్టా ద్వారా(ప్రభుత్వ భూములను పేద ప్రజలకు assgined lands కింద మంజూరు చేయడం), వస్తుంది.
ఏ భూములు లేదా సర్వే నంబర్ లు రిజిస్ట్రేషన్ కి అనుమతించబడవు?
అయితే వీటిలో డి- పట్టా భూమిని మరియు పూర్వపు పట్టా ఉండి కూడా పైన చెప్పుకున్న RSR లేదా Diglot లో చుక్కల పట్టా(Dotted land) laaga unna భూములు, దేవాదాయ భూములు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు కి చెందిన లాంటి సర్వే నంబర్ లు ఏవి కూడా సబ్- రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించరు.
రిజిస్ట్రేషన్ కి అనుమతించబడని భూమి లేదా సర్వే నంబర్ నీ తెలుసుకోవడం ఎలా?
ఆ విధంగా ఏ సర్వే నంబర్ లు ఏ క్లాసిఫికేషన్ కింద రిజిస్ట్రేషన్ కి అనుమతించరో ఆ సర్వే నంబర్స్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.
- మొదట మీరు AP IGRS అఫిషియల్ వెబ్సైట్ http://registration.ap.gov.in నీ ఓపెన్ చేయాలి.
- తరువాత కనిపించే స్క్రీన్ లో Prohibited search property అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- మీరు క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయ్యే పేజీ లో మీ యొక్క జిల్లాను, మండలాని, గ్రామాన్ని, మీరు చూడవలసిన సర్వే నంబర్ నీ అక్కడున్న టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసి Submit అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సర్వే నంబర్ ఏ కారణం చేత రిజిస్ట్రేషన్ కి అనుమతించబడదో అక్కడ మీకు చూపిచబడును.
Also check:
How to know market value of a land in AP