AP Govt servicesPAN card services
Instant PAN card apply online

Instant PAN card apply online
పాన్ కార్డు కావాలనుకుంటున్నారా? పది నిమిషాలలో మీరు పాన్ కార్డు ను పొందవచ్చు.
పది నిమిషాలలో మీరు పాన్ కార్డు పొందాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒక్కటే. మీ ఆధార్ కార్డును మీ సెల్ నెంబర్ తో లింక్ చేసుకోని ఉండాలి.
సరే ఇప్పుడు పాన్ కార్డు కి ఎలా అప్ప్లై చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాము.
How to apply for Instant e-PAN card online?
- ముందుగా మీరు Income tax అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. దీని కోసం ఇక్కడ Click చేయండి.
- ఆ తర్వాత, Income tax హోమ్ పేజీ మీకు ఈ క్రింది విధంగా open అవుతుంది:-

- పై చిత్రంలో చూపిన విధంగా Income tax హోమ్‌పేజీ లో Instant e-Pan అనే option ను ఎంచుకోండి. ఆ తర్వాత, Instant Pan card పేజీ క్రింది విధంగా కనిపిస్తుంది:-

- ఆ పేజీలో, మీరు Get new e-PAN ఎంపికను ఎంచుకోవాలి.
- మీకు కనిపించే next పేజీలో మీ ఆధార్ నంబర్ ను నమోదు చేసి “I confirm that” అనే బటన్ ని టిక్ మార్క్ పెట్టి “continue” మీద క్లిక్ చేయండి.

- ఆ తర్వాత, మీరు మీ registered మొబైల్ నంబర్ కు OTP నంబర్‌ను అందుకుంటారు, అక్కడ ఉన్న OTP బాక్స్‌లో OTP ని నమోదు చేసి, “verify” మీద క్లిక్ చేయండి.
- చివరగా, మీరు screen పై ఒక reference number ను పొందుతారు అలాగే మీ మొబైల్ నంబర్‌కు కూడా “మీరు ఈ-పాన్ కార్డ్ కోసం విజయవంతంగా దరఖాస్తు చేసారు” అని మెసెజ్ వస్తుంది.
- పైన ఇవ్వబడిన లింక్ ద్వార పాన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకున్న తరువాత మీరు తదుపరి మీ యొక్క పాన్ కార్డ్ ని డౌన్ లోడ్ చేయుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
Check status of pending e-PAN request / Download e-PAN.