Volunteer cluster mapping details

Table of Contents
Volunteer cluster mapping details
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019 సంవత్సరం లో శ్రీ వైస్ గారు ముఖ్యమంత్రి తరువాత గ్రామా వార్డ్ సచివాలయం వ్యవస్థను ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు ఇంటి వద్దకే అన్ని రకాల సేవలు మరియు అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడమే ద్యేయంగా ఈ వ్యవస్థని అమలు జరిగింది.
ఇలా ప్రతి సేవ అయినా లేదా సంక్షేమ పథకాలు ప్రజలకి తమ ఇంటి వద్దకే అందించటానికి వీలుగా ఈ సచివాలయం వ్యవస్థకు మరియు ప్రజలకు మధ్య అనుసంధానంగా గ్రామా వార్డ్ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
ఈ వాలంటీర్ వ్యవస్థలో ప్రతి 50 లేదా 100 ఇళ్లను ఒక క్లస్టర్ లాగ విభజించించి, ఒక వాలంటీర్ ను తీసుకోవడం జరిగింది. ఈ వాలంటీర్ తనకు నిర్ణయించిన ఆ క్లస్టర్ లోని ఇళ్లకు సంబందించిన హౌస్ హోల్డ్ ప్రజలకు సచివాలయం లో లభించు సేవలు మరియు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ పక్రియ చేసి లబ్ధిదారులకు ఆ సంక్షేమ ఫలాలను అందిస్తారు.
ఇపుడు మీరు ఏ క్లస్టర్ కి ఏ వాలంటీర్ సెలెక్ట్ చేయబడ్డాడో తెలుసుకోవాలంటే ఈ మన ఆర్టికల్ చదవండి.
- మొదట మీరు ఏ క్లస్టర్ కి ఏ వాలంటీర్ లేదా ఏ సచివాలయం లో ఎంతమంది వాలంటీర్ లు ఉన్నారు తెలుసుకోవాలంటే గ్రామా వార్డ్ సచివాలయము యొక్క ఆఫీసియల్ వెబ్ సైట్ https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main ని ఓపెన్ చేయాలి, అందుకు గాను చేయండి.

- తరువాతి స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ Applications అనే మెనూ పైన క్లిక్ చేయగానే Cluster -Volunteer Mapping అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

- ఆలా మీరు పైన చెప్పబడిన ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామా సచివాలయము వారీగా వాలంటీర్ క్లస్టర్ మాపింగ్ డేటా అన్నది కనిపిస్తుంది.


- ఆ తరువాత మీరు మీ యొక్క జిల్లాను, మండలాన్ని, మీ సచివాలయము ను సెలెక్ట్ చేసుకొని అక్కడ కనిపించే బ్లూ లెటర్స్ పై క్లిక్ చేసారంటే మీకు కావలసిన వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడి, పేరు, మొబైల్ నెంబర్, సి.యఫ్.ఎం .ఎస్ ఐడి లాంటి వివరాలు తెలుసుకోవచ్చు.
వాలంటీర్ యొక్క జీతాలు క్రెడిట్ అయ్యాయా లేదా అనేది తెలుసుకోండి.