Farmers schemes and servicesAP Govt servicesNavarathnalu

YSR Rythu Bharosa Scheme Details Telugu 2021

ysr rythu bharosa scheme details telugu 2021

ఆంధ్రప్రదేశ్ లోని రైతులు పంటకు కావలసిన ధాన్యాన్ని కొనుటకు పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 13500 రూపాయలు మన ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుంది. దీని తెలుసుకుందాము.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం

  • రైతుల యొక్క పంట పెట్టుబడిని అప్పు చేసి పెట్టుకొనేలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్ధిక సాయ అందజేస్తుంది.
  • రైతులకి వైస్సార్ సున్నవడ్డీ అనే పథకం ద్వారా వడ్డీలేని రుణాలు కూడా చేస్తారు.

ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలు

  • సంవత్సరానికి 13500/- రూపాయలు చొప్పున ఆలా 5 సంవత్సరాలకి 67,500/- రూపాయలు ఈ గవర్నమెంట్ ప్రతి రైతుకి నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోకి డి.బి.టి. పద్దతిలో అందజేస్తుంది.

ఈ పథకం యొక్క అర్హతలు

  • సొంత భూమి కలిగిన రైతులు మరియు కౌలు రైతులు కూడా ఇందుకు అర్హులు.
  • అన్ని కులాల వర్గాల రైతులకి ఈ పథకం వర్తించును.
  • Joint liability groups లో లేని రైతులు ఈ పథకానికి అర్హులు.
  • రుణ అర్హత కార్డు ఉన్న రైతులు మరియు అద్దె రైతులు అర్హులు.
  • వ్యవసాయ శాఖ ద్వారా లేదా రెవెన్యూ శాఖ ద్వారా సాగు ధృవీకరణ పత్రం ఉన్న రైతులు

ఈ పథకం యొక్క అనర్హతలు

  • ఇన్కమ్ టాక్స్ చెల్లించే వారు అనర్హులు.
  • సంస్థాగత భూ స్వాములు
  • ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు

దరఖాస్తు చేసుకునే విధానం

  • మీరు వ్యవసాయ శాఖ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. The official website is https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html
  • అర్హుల యొక్క జాబితాను గ్రామా వార్డ్ సచివాలయంలో ప్రదర్శిస్తారు.
  • ఏ రైతు వివరాలు అయినా తప్పుగా నమోదు చేసి ఉన్న లేదా ఎలాంటి తిరస్కరణలు ఉన్న ఫైనల్ లిస్ట్ తయారుచేసి మీ గ్రామా వార్డ్ సచివాలయంలో అర్హుల మరియు అనర్హుల జాబితాను రిలీజ్ చేస్తారు.

మీరు రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోవడానికి ఈ లింక్ చేయండి

వైస్సార్ రైతు భరోసా పేమెంట్ యొక్క సమస్యలు,వాటి పరిష్కారాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!