AP WELFARE SCHEMES 2020-21

Table of Contents
AP WELFARE SCHEMES 2020-21
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ పథకాల క్యాలెండర్ 2020-21 విడుదల
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత మానిఫెస్టో లో చెప్పిన నవరత్నాలు అనే పథకాలు అన్నింటినీ మాట తప్పకుండా మడమ తిప్పకుండా చేసి పెట్టడమే కాక మానిఫెస్టో లో లేని సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టాడు, వాటికి సంబంధించి 2020-21 సంవత్సరమునకు సంబంధించి క్యాలెండర్ నీ కూడా విడుదల చేశారు. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.
మే 2020:
. 26వ తేదీన దేవాలయ అర్చకులకు, ఫాస్టర్స్ కు, మసీదులో మతపెద్దలు కు 5000 చొప్పున సాయం.
. 30వ తేదీన వైస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతులకు విత్తనాలు మరియు పంటకు కావల్సిన ఎరువుల పంపిణీ.
జూన్ 2020:
. జూన్ 4వ తేదీన రెండో విడత గా అర్హత కలిగిన ఆటో,మ్యాక్సి డ్రైవర్లకు 10000 ఆర్థిక సాయం.
. జూన్ 10వ తేదీన అర్హత కలిగిన టైలర్ లు, నాయి బ్రహ్మిన్ లకు, రజకులకు 10000 ఆర్థిక సాయం.
. జూన్ 17వ తేదీన జగనన్న చేనేత నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం కలిగిన నేతన్నలు కు ఆర్థిక సాయం.
. జూన్ 24వ తేదీన వైస్సార్ కపు నేస్తం అనే పథకం కింద అర్హులకు 15000 ఆర్థిక సాయం
జూలై 2020:
. జూలై 1వ తేదీన 1066 104 మరియు 108 వాహనాల ప్రారంభం.
. జూలై 8వ తేదీన మహానేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మన రాష్ట్రం లో ఇల్లు స్థలాలు లేని అర్హులైన పేదలందరికీ 27 లక్షల ఇంటి స్థలాల పట్టాల పంపిణీ.
. జూలై 29వ తేదీన రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు.
ఆగస్ట్ 2020:
. ఆగస్ట్ 3వ తేదీన వైస్సార్ విద్యా కానుక పథకం ప్రారంభం.
. ఆగస్ట్ 9వ తేదీన ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసులకు ROFR ఇళ్ళ పట్టాల పంపిణీ
. ఆగస్ట్ 9వ తేదీన వైస్సార్ వసతి దీవెన పథకం ప్రారంభం.
. ఆగస్ట్ 12వ తేదీన వైస్సార్ చేయూత పథకం ప్రారంభం.
. ఆగస్ట్ 26వ తేదీన 15 లక్షల ఇళ్లు మంజూరు.
సెప్టెంబర్ 2020:
. సెప్టెంబర్ 11వ తేదీన వైస్సార్ ఆసరా పథకం ప్రారంభం.
. సెప్టెంబర్ 26వ తేదీన వైస్సార్ విద్యా దీవెన పథకం రెండో విడత అమౌంట్ విడుదల.
అక్టోబర్ 2020:
. అక్టోబర్ 20వ తేదీన వైస్సార్ రైతు భరోసా రెండో విడత అర్హులైన వారందరికీ 4000 ఆర్థిక సాయం.
. అక్టోబర్ నెలలో గుర్తింపు కార్డు ఉన్న ప్రతి చిరు వ్యాపారికి 10000 వడ్డీలేని రుణాలు మంజూరు.
డిసెంబర్ 2020:
. డిసెంబర్ నెలలో అగ్రి గోల్డ్ బాధితులకు సాయం.
2021 సంవత్సరం:
. జనవరి నెలలో అమ్మఒడి రెండో విడత మరియు మూడో విడత వైస్సార్ రైతు భరోసా మంజూరు.
. ఫిబ్రవరి నెలలో విద్యా దీవెన మరియు రెండో విడత జగనన్న వసతి దీవెన మంజూరు.
. మార్చి నెలలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు.