Farmers schemes and servicesAP Govt servicesGSWS services

How to get CCRC cards in AP

How to get CCRC cards in AP


కౌలురైతులు అంటే ఏమిటి? కౌలురైతులు ఎలాంటి ప్రభుత్వ పథకాలలో లభ్ది పొందవచ్చు? ఒక వ్యక్తి ఎప్పుడు కౌలు రైతు అవుతాడు? అనే పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. ఒక వ్యక్తి తనకు భూమి లేనప్పుడు అతను భూమి ఉన్న యజమాని దగ్గర నుంచి ఒక ఒప్పందం ప్రకారం భూమి ని సాగు చేస్తాడు వారినే మనం కౌలు రైతులు అంటారు.
  2. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు వైస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 17500/- రూపాయలు ఇస్తున్నారు. ఈ యొక్క పథకానికి కౌలు రైతులు కూడా అర్హులు అని మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చారు. అలాగే ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి కూడా అర్హులే అని నిర్ణయించారు. ఈ PM Kisan పథకం ద్వారా కూడా రైతుకు సంవత్సరానికి 6000/- రూపాయలు అందజేస్తారు.
  3. అయితే ఈ కౌలు రైతులు పైన చెప్పినట్టు అన్ని రాష్ట్ర మరియు కేంద్ర రైతు పథకాలకు అర్హులు అవ్వాలంటే CCRC Cards ను పొందాలి. CCRC(Crop Cultivator Rights Cards) అంటే పంటను సాగు చేయు కౌలు రైతు హక్కు కార్డు అని అర్థం. వాటిని ఎలా పొందాలో ఈ కింద ఉన్న లింక్ తో పూర్తి వివరాలు తెలుసుకోండి.

What is CCRC Card?

  • CCRC Cards అంటే పంట సాగుబడి చేసే కౌలు రైతు యొక్క హక్కు కార్డు అని అర్థం, అయితే వీటి గురించి వివరంగా తెలియాలి అంటే ముందుగా మనం కౌలు రైతుల గురించి తెలుసుకోవాలి. భూమి ఉన్న ఒక రైతు తన యొక్క భూమి ని ఒక వ్యక్తికి పంట సాగు చేయడానికి ఓకే ఆఒప్పందా పద్దతిలో భూమి ని సాగు చేయడానికి ఇవ్వడాన్ని కౌలుకు ఇవ్వడం అంటారు. అయితే ఈ కొలు రైతులు కూడా మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నా రైతు సంక్షేమ పథకాలలో లభ్ది పొందటానికి అర్హులు.

ఈ కౌలు రైతులు ఏ విధంగా అర్హులో చూద్దాం.
1. మొదట కౌలు రైతు భూమి యజమాని నుంచి తాను ఆ భూమిని కౌలు పద్దతిలో సాగు చేస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ అనేది Document పద్దతిలో జరగాలి.
2. ఆ డాక్యుమెంట్ ని మరియు భూమి యజమాని యొక్క పాతదార్ పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, తరువాత కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు ఒక ఫోటో ని మీ గ్రామ VRO గారి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మీరు CCRC కార్డు కి దరఖాస్తు చేయాలి.
3. ఆ దరఖాస్తు విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
4. మీరు మీ గ్రామ VRO ని సంప్రదించిన తరువాత వారు మీ యొక్క అర్హతను పరిశీలించిన తదుపరి వారు వారికి ఇవ్వబడిన Logins తో CCRC Module Portal ని ఓపెన్ చేసుకొని మీ వివరాలు అక్కడ సబ్మిట్ చేసి మీకు ఓక CCRC కార్డును ఇస్తారు.
5. CCRC Online విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
6. CCRC వెబ్ పోర్టల్ కి లాగిన్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తరువాత ఈ కింది విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ మన గ్రామా VRO గారు అతనికి ఉన్న login credentials తో లాగిన్ అవుతారు. ఆ వెబ్ పేజీ ఇలా ఉంటుంది

ccrc-page

లాగిన్ అయినా తరువాత ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భూమి యజమాని యొక్క ఖత నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిన తరువాత ఆ రైతు యొక్క సర్వే నంబర్స్ చూపిస్తుంది.
8. అక్కడ కౌలు రైతుకు ఏ సర్వే నంబర్స్ అయితే సాగు చేయుటకు ఇచ్చి ఉంటారో వాటిని సెలెక్ట్ చేసి తరువాత కాలమ్ లో కౌలు రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి అతనికి ఏ భూమి లేదు అని పరిశీలించిన పిమ్మట సబ్మిట్ చేస్తారు. ఆలా చేసిన తరువాత మీకు CCRC Card ఇస్తారు.
9. ఆ కార్డు ని మీ సచివాలయం లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ను గాని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ని గాని సంప్రదించి అక్కడ మీకు ఇవ్వబడిన Card తో PM Kisan కి మరియు YSR Rythu Barosa కి మీరు apply చేసుకోవచ్చు.
10. మీరు కార్డ్స్ సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి అక్కడ జిల్లా, మండలం మరియు మీ సెక్రటరియేట్ ని ఎంచుకుంటే మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు.

To know the Abstract Report Of CCRC Module Cards click here.

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!

Discover more from HK Telugu Weblinks

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading