AP Govt servicesNavarathnalu

YSR PENSION KANUKA DETAILS

 

YSR PENSION KANUKA DETAILS

పెన్షన్ అర్హతలు మరియు పెన్షన్ రకాలు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో లో ప్రవేశపెట్టిన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలలో వైస్సార్ పెన్షన్ కానుక ఒకటి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు.

YSR PENSION KANUKA DETAILS

ఆంధ్రప్రదేశ్ పింఛను పొందడానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

1. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం 10000/- ఉండాలి, పట్టణ ప్రాంతాలలో 12000/- ఉండాలి.
2. ఆధార్ కార్డు కలిగివుండాలి.
3. గ్రామ, వార్డు పరిధిలో ఒప్పందం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అర్హులే.

అనర్హత ప్రమాణాలు

1. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.
2. మెట్టభూమి 10 ఏకరములు, మాగాణి 3 ఏకరాములు పై ఉన్నవారు అనర్హులు.
3. సొంత 4 వీలర్ వాహనం కలిగి ఉన్నవారు కూడా అనర్హులు.
4. కుటుంబం లో ఎవరైనా income tax చెల్లించే వారు ఉన్న అనర్హులు.
5. పట్టణ ప్రాంతాలలో 750 చ.ఆ. కంటే ఎక్కువ ఉన్నవారు కూడా అనర్హులు.

పెన్షన్లు మరియు వాటి రకాలు
I. వృద్ధాప్య పింఛన్లు:

. అరవై సంవత్సరాలు నిండి ఉండాలి మరియు ఆ పై వయసు ఉన్నవారు.
. గిరిజన ప్రాంతాలలో 50 సం. నిండిన వారు ఆ పై వయస్సు ఉన్నవారు.

II. వితంతు పెన్షన్:

. 18 సం. వయస్సు ఉండి ఆ పై వయస్సు ఉన్నవారు భర్త చనిపోయిన వారు. దృవీకరణ పత్రం జతపర్చలి.

III. వికలాంగుల పెన్షన్:

. వీరికి వయోపరిమితి లేదు, 40% అంగవైకల్యం ఉండి సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

IV. చేనేత కార్మికుల పెన్షన్:

. వయస్సు 50సం. పైబడి రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ నుండి గుర్తింపు పత్రం ఉండాలి.

V. కల్లుగీత కార్మికులు:

. వయస్సు 50సం. పైబడి ఉండి ఎక్సైజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం ఉండాలి.

VI. మత్స్య కార్మికుల పెన్షన్:

. వయస్సు 50సం. పైబడి మత్స్య శాఖ నుంచి గుర్తింపు పత్రం కలిగి ఉండాలి.

VII. HIV బాధితులు(TLHIV పెన్షన్):

. దీనికి వయోపరిమితి లేదు, 6 నెలలు వరుసగా ART treatment therophy తీసుకొని ఉండాలి.

VIII. డయాలసిస్(CKDU పెన్షన్):

. వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ లో మరియు వైస్సార్ ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన హాస్పిటల్ లో పరీక్షలు చేయించుకుంటున్నారు( స్టేజ్ III,IV మరియు V th వారు).

IX. ట్రాన్స్ జెండర్ పెన్షన్:

. 18సం.లు వయస్సు పైబడిన వారు ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ నుంచి గుర్తింపు పత్రం పొంది ఉండాలి.

X. ఒంటరి మహిళలు:

. 35 సం.లు వయస్సు పైబడిన వారు భర్త నుంచి విడాకులు పొంది ఉన్న, భర్త నుంచి విడిపోయి ఉన్న (విడిపోయిన వ్యవధి కనీసం సంవత్సరకాలం ఉండాలి) అర్హులు.
. 30సం.లు వయస్సు నిండి పెళ్లి కాకుండా ఎలాంటి ఆదరణ లేని ఒంటరి మహిళలకు కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది అయితే వీరికి పెళ్లి అయ్యి జీవనోపాధి దొరికిన తరువాత పెన్షన్ నిలుపుదల చేసే అధికారం మండల స్థాయి అధికారులకు ఉంది.

XI. డప్పు కళాకారుల పెన్షన్:

. వయస్సు 50సం.లు పైబడి అపైన వయస్సు ఉండి సాంఘీక సంక్షేమ శాఖ వారి నుంచి గుర్తింపు పత్రం ఉండాలి.

XII. చర్మకారులు పెన్షన్:

. వయస్సు 40సం.లు పైబడినవారు ఆపైన వయస్సు ఉన్నవారు.

XIII. అభయహస్తం:

. స్వయం సహాయ సంఘ సభ్యులు ఎవరైతే వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉంటారో అలాంటి వారు అర్హులు.

XIV. వివిధ రకాల వ్యాధులు:

. తలసేమియా
. సికిల్ సెల్ ఎలిమియా వ్యాధి
. తీవ్ర హిమొఫీలియా
. ద్వైపాక్షిక బోధ వ్యాధి
. పక్షవాతంతో ఉన్నవారు
. నరాల బలహీనతను ఉన్నవారు.
. కిడ్నీ వ్యాధి
. ఆరోగ్య శ్రీ కార్డు కింద గుండె సంబంధిత వైద్యం చేయించుకున్న వారు అర్హులు.

Note:

పైన తెలపవడిన ప్రకారం అర్హతలు ఉండి పెన్షన్ పొందని వారు మీ ఆధార్ కార్డు, కుటుంబ ఆదాయ,కుల ధృవీకరణ పత్రం, పైన చెప్పిన పెన్షన్ రకాలు కు సంబంధించిన ప్రభుత్వం విభాగం వారు జారీ చేసిన పత్రాలను మీ గ్రామ/వార్డు వాలంటీర్ కి ఇచ్చినచో వారు మొబైల్ app నందు నమోదు చేస్తారు లేదా నీకు సంబందించిన గ్రామ/వార్డు సచివాలయం లేదా మండల స్థాయి అధికారులకు మీ అర్హత పత్రాలు ఇచ్చి నమోదు చేయించుకోండి.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!