Aadhar Card Reprint


Table of Contents
Aadhar Card Reprint and Aadhar Reprint Status
ఆధార్ కార్డును ప్రింట్ రూపంలో పొందే విధానం 1. కింద ఇవ్వబడిన ఆధార్ అధికారిక వెబ్‌సైట్ ను సెలెక్ట్ చేసుకోండి.
లేదా ఫోన్‌లో mAadhaar App ను ఓపెన్ చేయాలి. 2. సైట్‌లో లేదా యాప్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల ఆధార్ వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (వీఐడీ)ని ఎంటర్ చేయాలి. 3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సైట్ లేదా యాప్‌లో ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి. 4. అనంతరం అక్కడ ఉండే ఆర్డర్ ఆధార్ రీప్రింట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 5. ఆధార్ కార్డును స్పీడ్ పోస్టులో డెలివరీ అందుకునేందుకు గాను రూ.50 చార్జిలు సైట్‌లో లేదా యాప్‌లో చెల్లించాలి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ విధానాల్లో ఆ చార్జిలను చెల్లించవచ్చు. చార్జిలను చెల్లించాక ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం 15 రోజుల్లోగా ప్రింట్ చేయబడిన ఆధార్ కార్డు మీ ఇంటికే డెలివరీ అవుతుంది.