How to check the status of 6 step validation
How to check the status of 6 step validation
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలలో లబ్ధి పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అయితే ఆ విధంగా పథకాలలో లబ్ధి పొందే అర్హత ఉండి కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తుదారుడు యొక్క డేటా తప్పుగా నమోదు కావడం వల్ల అర్హత పొందలేక పథకాల లబ్ధి పొందనివారు అర్హత పొందాలంటే ఏ పథకానికి ఏ కారణం వల్ల అర్హత లేదో ఆ యొక్క పత్రాలను సమర్పించి అర్హత పొందవచ్చు.
ఆ విధంగా అర్హత పొందాలి అంటే మీ అర్హతకు సంబందించిన పత్రాలు అన్నిటినీ తీసుకొని మీ గ్రామ వార్డు సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ తో ఒక grievance నీ నమోదు చేయాలి.
ఆ విధంగా డిజిటల్ అసిస్టెంట్ తో నమోదు చేసిన grievance వెల్ఫేర్ సెక్రటరీ login లో ఫీల్డ్ వెరిఫికేషన్ కి పంపించబడుతుంది.
వెల్ఫేర్ సెక్రటరీ తో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి అయ్యాక పంచాయతీ సెక్రటరీ login లోకి పంపించబడుతుంది.
ఆ తరువాత పంచాయతీ సెక్రెటరీ ఆ grievance అప్లికేషన్ నీ verify చేసి MPDO గారికి పంపిస్తారు.
ఆ తరువాత MPDO గారు జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి పంపిస్తారు.
ఇలా పంపిన మీ యొక్క grievance జిల్లా సంయుక్త కలెక్టర్ వారి దగ్గర approve గాని లేదా reject గానీ అవుతుంది.
ఈ యొక్క grievance అప్రూవల్ లేదా రిజెక్ట్ అనే status తెలుసుకోవడానికి ఈ కింది లింక్ ను ఎంచుకోండి.
Link1:- Grievance report
Link2:- Grievance master report