Ammavodi 2021

Table of Contents
Ammavodi 2021
పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నరత్నాలలో “జగనన్న అమ్మఒడి” అనే ఒక పథకాన్ని రూపొందించారు. తల్లుల గురించి వారి పిల్లల గురించి అలోచించి, బడికి వెళ్లే ప్రతి పేద విద్యార్థి యొక్క తల్లి బ్యాంకు ఖాతాలోకి సంవత్సరానికి 15 వేల రూపాయలు అందజేస్తారు.
ప్రయోజనాలు:
. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం జనవరి నెలలో తల్లుల యొక్క బ్యాంకు ఖాతాలలోకి నేరుగా 15 రూపాయలు జమ చేస్తారు.
. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ,ప్రైవేట్ మరియు అన్ని గుర్తింపు పొందిన పాఠశాల మరియు కళాశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు:
. అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారా ?కాదా? అని ఆరు దశల ధ్రువీకరణ తరువాత లబ్ధిని చేకూరుస్తారు.
. విద్యార్థి యొక్క తల్లి ఆధార్ మరియు బ్యాంకు ఖాతా ని కలిగి ఉండాలి.
. అర్హత కలిగి ఉన్న ప్రతి విద్యార్థి కనీస హాజరు శాతం 75% ఉండాలి.
అనర్హతలు:
. పిల్లలు చదువు మధ్యలో మానేసిన ఆ విద్యా సంవత్సరానికి ఈ పథకానికి అర్హులు కాదు.
. ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయాక ఈ పథకం వర్తించదు.
. విద్యార్థి యొక్క హాజరు శాతం 75% కంటే తక్కువ ఉన్న ఈ పథకానికి అర్హులు కాదు.
ధరఖాస్తు చేయడానికి కావలసినవి:
. రైస్ కార్డు
. ఆధార్ కార్డు(తల్లి, విద్యార్థిది)
. తల్లి యొక్క బ్యాంకు ఖాతా నెంబర్
. విద్యార్థి స్కూల్ లో, కళాశాలలో చేరినప్పటి అడ్మిషన్ నెంబర్.
. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్.
. విద్యార్థి అటెండన్స్ సర్టిఫికెట్.
. తల్లి,విద్యార్థి పాస్పోర్ట్ సైజు ఫోటోలు.
ముఖ్యమైన తేదీలు:
వివరాలు | తేదీ |
అర్హులు అయినా వారి జాబితాను గ్రామా వార్డ్ సచివాలయాలు లో ప్రదర్శించు తేదీ | 16/12/2020 |
అభ్యంతరాలు, సూచనలపై సవరించిన జాబితాను ‘అమ్మఒడి’ పోర్టల్ లో ప్రకటించే తేదీ | 19/12/2020 |
పాఠాశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాల్ సచివాలయ సిబ్బందితో సవరించిన జాబితాను పరిశీలన జరిగే తేదీలు | 20/12/2020 to 24/12/2020 |
తుది జాబితాను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించు తేదీ | 26/12/2020 |
సవరించిన జాబితాను గ్రామ, వార్డు సభలలో ఆమోదం పొందు తేదీ | 27/12/2020 to 28/12/2020 |
గ్రామ, వార్డు సభలలో ఆమోదం పొందిన జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేయు తేదీ | 29/12/2020 |
తుది జాబితాను కలెక్టర్, జిల్లా డి.ఈ.ఓ లకి పంపి వారి ఆమోదం పొందే తేదీ | 30/12/2020 |
తల్లి యొక్క బ్యాంకు ఖాతా లోకి హేమ అయ్యే తేదీ | 09/01/2021 |