YSR Rythu bharosa payment issues and solutions

Table of Contents
YSR Rythu bharosa payment issues and solutions
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయు రైతు భరోసా డబ్బులు వారి యొక్క బ్యాంకు ఖాతా లోకి జమ కానీ వారికి ఈ క్రింది సమస్యలు ఉండటం వల్ల పేమెంట్ అనేది జరిగిఉండదు.
ఆలా మీకు డబ్బులు పడకపోతే ఈ క్రింది కారణాల వల్ల జమ అయ్యిండదు. కాబట్టి మీరు ఈ క్రింద తెలుపబడిన వాటిలో మీ సమస్య ఏంటి అన్నది తెలుసుకొని మీరు ఆ విధంగా చేసుకున్నచో మీకు తదుపరి వచ్చే విడతలలో మీ ఖాతాలలో అమౌంట్ క్రెడిట్ అవుతుంది.
సమస్యలు వాటి పరిష్కారాలు :-
1. సమస్య – ప్రజా సాధికార సర్వే లో మీరు నమోదు అవ్వకపోవవడం వలన
. ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి :- మీ రైస్ కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత PSS supervisor / enumarator దగ్గర నమోదు చేయించుకోగలరు. ఇందుకొరకు గ్రామ వాలంటీర్ లేదా గ్రామ రెవిన్యూ అధికారి.
2. సమస్య – మరణ కేసులు / పోతి కేసులు / నోషనల్ ఖాతాలు
. ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి :- ఆధార్ కార్డు, ROR – IB నకలు తీసుకొని సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా గ్రామ రెవిన్యూ అధికారిని సంప్రదించాలి.
3. సమస్య – తప్పుగా ఆధార్ నెంబర్ సీడింగ్ చేసుకొనుటకు / వెబ్ ల్యాండ్ లాగిన్ లో మీ ఖాతా కు ఆధార్ సీడింగ్ చేయించుకోకపోవుట.
. ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి :- మీ ఆధార్ కార్డు మరియు మీ ROR -IB నకలు తీసుకొని సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా గ్రామ రెవిన్యూ అధికారిని సంప్రదించండి.
4. సమస్య – బ్యాంకు ఖాతా తో ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవుట
. ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి :- మీ ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా పాస్ బుక్ ని సంబంధిత బ్యాంకు వెళ్లి అక్కడ క్లర్క్ ని సంప్రదించండి.
5. సమస్య – ల్యాండ్ రికార్డ్స్ లో ఉండి, ఆధార్ సీడింగ్ అయ్యి ఉండి, బ్యాంకు, ఆధార్ లింక్ అయ్యి ఉండి కూడా మీకు డబ్బులు క్రెడిట్ అవ్వకపోతే.
. ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలి :- ఇలాంటి సమస్య ఉన్నవారు మొదట మీరు దరఖాస్తు చేసుకున్నారో లేదో తెలుసుకోండి. అందుకు మీరు మీ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంకు పాస్ పుస్తకం మరియు మీ మొబైల్ నెంబర్ ని దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లో గ్రామ వ్యవసాయ సహాయకులు ను సంప్రదించి అన్ని సరిచూసుకోగలరు.